ETV Bharat / snippets

బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ - సభ నుంచి విపక్షాలు వాకౌట్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 1:07 PM IST

Jharkhand CM Floor Test
Jharkhand CM Floor Test (ETV Bharat)

Jharkhand CM Floor Test : ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 45మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. స్వతంత్ర శాసన సభ్యుడు సరయూ రాయ్ విశ్వాస పరీక్ష ఓటింగ్​లో పాల్గొనలేదు.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చకు అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర నాథ్ మహతో గంట సమయం కేటాయించారు. చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు సోరెన్ సర్కార్​కు వ్యతిరేకంగా నినదిస్తూ, సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. కాగా, ఇటీవలే జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ జులై 4 ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం అసెంబ్లీలో తాజాగా బలనిరూపణ చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.