ETV Bharat / snippets

'పాకిస్థాన్​ ఉగ్రవాదులను ఎగదోస్తోంది' - జమ్మూకశ్మీర్​ ఎల్​జీ

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 7:02 AM IST

Jammu Kashmir LG on Pakistan
Jammu Kashmir LG on Pakistan (ANI)

Jammu Kashmir LG on Pakistan : జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు, పాకిస్థాన్‌ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్‌లోకి ఎగదోస్తోందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) మనోజ్‌ సిన్హా అన్నారు. జమ్ముకశ్మీర్​లో ఇటీవల జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎల్‌జీ మనోజ్‌ సిన్హా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

'ఇటీవలి ఉగ్ర ఘటనలు బాధాకరం. వాటిని కచ్చితంగా నియంత్రిస్తాం. పాకిస్థాన్​ ఉగ్రవాదానికి నిలయంగా మారింది. మన జమ్మూకశ్మీర్​లోని శాంతిభద్రతలను అస్థిరపర్చేందుకు వారిని ప్రోత్సహిస్తోంది. పొరుగు దేశపు దుర్మార్గపు కుట్రలను విఫలం చేసేందుకు భద్రతా బలగాలు, పాలనా యంత్రాంగం ఒక వ్యూహాన్ని రూపొందించాయి. భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ వ్యూహాన్ని సమీక్షించారు. రానున్న రోజుల్లో కచ్చితంగా మంచి సత్ఫలితాలు ఉంటాయి' అని మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.