ETV Bharat / snippets

కశ్మీర్​లో 34ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయం- అదే కారణమట!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 2:20 PM IST

Uma Bhagwati Temple Anantnag
Uma Bhagwati Temple Anantnag (ETV Bharat)

Uma Bhagwati Temple Anantnag : మూడు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉమా భగవతి అమ్మవారి ఆలయం తెరచుకుంది. కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమక్షంలో ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెరిచారు. ఆలయ పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఉన్నతాధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ఉమా దేవి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠాపన చేశారు. ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం ప్రకటించారు. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగినట్లు కేంద్రమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.