Bomb Threats For Multiple Flights : దేశంలో విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బాంబు బెదిరింపులు మాత్రం
ఆగడం లేదు. శనివారం 30పైగా విమానాలకు బాంబు హెచ్చరికలు రాగా, ఇవాళ కూడా మరో 24 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీనితో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, ఆకాశ్ సహా పలు విమానాసంస్థలకు చెందిన 20కిపైగా దేశీ, విదేశీ విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీ జరిపి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ లభించలేదని ప్రకటించారు. ఈవారం రోజుల్లో దాదాపు 90కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలపై ఇప్పటికే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆటకట్టించేందుకు కఠినచర్యలు తీసుకొనే దిశగా పౌర విమానయానశాఖ కూడా సన్నద్ధమవుతోంది.
ఆగని బాంబు బెదిరింపులు - ఒక్క రోజే 24 విమానాలకు!
Published : Oct 20, 2024, 5:49 PM IST