ETV Bharat / snippets

INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం- ఒక వైపునకు ఒరిగిన యుద్ధనౌక- అధికారి గల్లంతు

ins brahmaputra fire incident
ins brahmaputra fire incident (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 10:27 PM IST

INS Brahmaputra Fire Incident : భారత నావికాదళంలోని INS బ్రహ్మపుత్ర యుద్ధనౌక అగ్నిప్రమాదానికి గురైంది. మెయింటనెన్స్‌లో భాగంగా ముంబయి నావల్‌ డాక్‌యార్డ్‌లో రీఫిట్టింగ్‌ సర్వీస్‌లు చేస్తుండగా యుద్ధనౌకలో మంటలు చెలరేగినట్లు నావికాదళ అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో గల్లంతైన జూనియర్ నావికాదళ అధికారిని సహాయక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన సిబ్బంది క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగగానే అప్రమత్తమైన డాక్‌యార్డ్‌ అగ్నిమాపక సిబ్బంది, గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో యుద్ధనౌక ఒకవైపునకు పూర్తిగా ఒరిగింది. ప్రమాద తీవ్రతను అంచనా వేసేందుకు శానిటైజేషన్ తనిఖీలతో సహా తదుపరి చర్యలు చేపట్టామనీ, ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని ప్రకటించింది. స్వదేశీ నిర్మిత క్లాస్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌లో INSబ్రహ్మపుత్ర మొదటిది. 2వేల సంవత్సరంలో నౌకాదళంలోకి చేరిన ఈ యుద్ధనౌకలో స్వల్ప, మధ్యశ్రేణి విమాన విధ్వంసక గన్లు, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, టార్పెడో లాంచర్‌లు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.