IAF MiG 29 Aircraft Crash : భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 యుద్ధ విమానం రాజస్థాన్లోని బాడ్మేడ్ జిల్లాలో సోమవారం రాత్రి కూలిపోయింది. అయితే పైలట్ మాత్రం పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. విమాన శకలాలు జనావాసాలకు దూరంగా పడడం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. శిక్షణలో భాగంగా రాత్రివేళ ఈ యుద్ధవిమానం నింగిలోకి వెళ్లిందని ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది. అయితే అనుకోకుండా సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
కూలిన మిగ్-29 యుద్ధ విమానం - కారణమిదే!
Published : Sep 3, 2024, 8:41 AM IST
|Updated : Sep 3, 2024, 8:57 AM IST