ETV Bharat / snippets

'యడియూరప్పను అరెస్ట్ చేయొద్దు'- పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట

BS Yediyurappa POCSO Case
BS Yediyurappa POCSO Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 5:16 PM IST

BS Yediyurappa POCSO Case : పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్​ నేత బీఎస్ యడియూరప్పకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తుకు సహకరించాలని ఆయన్ను కోరాలని చెప్పింది. జూన్​ 17న సీఐడీ ఎదుట విచారణకు హాజరుకావాలని యడియూరప్పకు సూచించింది. అంతకుముందు గురువారం బెంగళూరు కోర్టు ఆయనపై నాన్​ బెయిలబుల్​ అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది.

తన 17 ఏళ్ల కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సదాశివనగర్​ పోలీస్​ స్టేషన్​లో యడియూరప్పపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అనంతరం కొద్ది గంటల వ్యవధిలో మార్చి 14న ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.