ETV Bharat / snippets

వయనాడ్​కు ప్రముఖుల ఆపన్నహస్తం- ఒక్కొక్కరు రూ.5కోట్లు ఇచ్చిన బిజినెస్​మెన్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 7:14 PM IST

wayanad landslide 2024
wayanad landslide 2024 (Assosiated Press, ANI)

Wayanad Landslide 2024 : కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఐదు కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. అదానీతో పాటు RPగ్రూప్‌ ఛైర్మన్‌ రవి పిళ్లై, లూలు గ్రూప్ ఛైర్మన్‌ MA యూసఫ్‌ అలీ, కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ TS కల్యాణ రామన్‌ కూడా ఒక్కొక్కరూ ఐదు కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. అటు తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 20లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్‌ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు ప్రకటించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.