FSSAI On 100 Percent Fruit Huice Claim : ప్రకటనల్లో, ప్యాక్ చేసిన ఉత్పత్తుల లేబుళ్లపై '100శాతం పండ్ల రసం' అనే ట్యాగ్‌లను తొలగించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ఆదేశించింది. తక్షణమే ఆదేశాలు అమలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను 2024 సెప్టెంబర్ 1లోపు వాడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 'చాలా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు పునర్మించిన జ్యూస్‌లను 100శాతం పండ్ల రసాలు అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది సరికాదు. అవి తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి' అని FSSAI తెలిపింది. అయితే జ్యూస్‌లో పోషకాహర స్వీటెనర్స్ 15గ్రా/కిలో కంటే ఎక్కువగా ఉంటే, ఆ ఉత్పత్తిని 'స్వీటెన్డ్ జ్యూస్'గా లేబుల్ వేయాలని తెలిపింది. ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2018 ప్రకారం 100శాతం క్లెయిమ్ చేసుకునే నిబంధన ఏదీ లేదని తేల్చి చెప్పింది.
''100 శాతం ఫ్రూట్ జ్యూస్' ట్యాగ్‌ను అర్జెంట్‌గా తొలగించాల్సిందే!'
Published : Jun 4, 2024, 7:53 AM IST