Jaishankar Foreign Minister : రాయబారి నుంచి రాజకీయవేత్తగా మారిన జైశంకర్ మంగళవారం వరుసగా రెండోసారి విదేశాంగ మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా ఆయన వెల్లడించారు. తనకు ఈ బాధ్యత కట్టబెట్టిన ప్రధానమంత్రి మోదీకి, జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. 2019 నుంచి విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగుతున్న జైశంకర్ అనేక సంక్లిష్ట అంశాలపై భారత్ విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేయటంలో ఆయన తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. జైశంకర్‌తో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తోపాటు జితేంద్రసింగ్, సహాయ మంత్రులు సురేశ్ గోపి, గిరిరాజ్‌సింగ్ కూడా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈనెల 9వ తేదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోదీ 71మంది మంత్రులతో కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
కొలువుదీరిన కొత్త మంత్రులు- మరోసారి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ ఛార్జ్
Published : Jun 11, 2024, 10:36 AM IST