ETV Bharat / snippets

రెస్ట్ లేకుండా 17గంటలు స్విమ్మింగ్​​- ఇంగ్లీష్​ ఛానల్​ను ఈది 'ఇండియన్ మదర్'​గా రికార్డ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 7:42 AM IST

English Channel Swim Challenge Tanvi Deore
English Channel Swim Challenge Tanvi Deore (ETV Bharat)

English Channel Swim Challenge Tanvi Deore : ఇంగ్లీష్ ఛానల్​ను ఈదిన మొదటి భారతీయ తల్లిగా మహారాష్ట్రలోని నాశిక్​కు చెందిన తన్వి చవాన్ దెవరె(33) రికార్డ్ సృష్టించారు. యూకేలోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు 42కిమీల దూరాన్ని తన్వి 17 గంటల 42 నిమిషాల్లో పూర్తి చేశారు. జూన్​ 29 ఉదయం 8గంటలకు ప్రారంభించిన ఈ సవాలన్​ను ఎలాంటి విశ్రాంతి లేకుండా పూర్తి చేశారు. తన్వికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఇంగీష్​ ఛానల్​ను ఈదిన మొదటి భారతీయ తల్లిగా నిలిచారు. ఇంగ్లాండ్- ఫ్రాన్స్​ను వేరు చేసే ఇంగ్లీష్ ఛానల్​ను ఈతడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన వాటిల్లో ఒకటి. ఈ ఘనతను సాధించేందుకు ప్రతిరోజూ 8-10 గంటలు ప్రాక్టిస్ చేస్తూ ఉండేదని తన్వి పేర్కొన్నారు. 16డిగ్రీల సెల్సియస్​ చల్లటి నీటిలో ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాని, మధ్యలో జెల్లీ ఫిష్​లు కూడా కుట్టేవని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.