ETV Bharat / snippets

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు - నేడే షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

author img

By ETV Bharat Telugu Team

Published : 13 hours ago

Updated : 13 hours ago

Election Commission Of India
EC (IANS)

EC To Announce Schedule For Maharashtra, Jharkhand Polls Today : మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం3.30 గంటలకు ప్రకటించనుంది. వీటితోపాటు 3లోక్​సభ స్థానాలకు, 47అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికల షెడ్యుల్​ను ప్రకటించే అవకాశం ఉంది.

మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబరు 26తో ముగియనుంది. ఇక్కడ బీజేపీ, ఎన్​సీపీ (అజిత్ పవార్ వర్గం), శివసేన( శిందే వర్గం) కలిసి మహాయుతిగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్, ఎన్​సీపీ (శరద్ పవార్), శివసేన(ఉద్ధవ్ వర్గం) కలిసి మహావికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు ఝార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి5తో ముగియనుంది. అక్కడ బీజేపీ, దాని మిత్రపక్షాలకు, జేఎంఎం కూటమికి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అగ్రనేత వయనాడ్​, రాయ్​బరేలీ రెండూ చోట్ల విజయం సాధించారు. దీనితో వయనాడ్​ స్థానానికి రాజీనామా చేశారు. కనుక అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.

Last Updated : 13 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.