Money Demand In The Name Of CJI : సైబర్ నేరగాళ్లు తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరుతో మోసం చేయాలని చూశారు. ఎలా అంటే? ఎక్స్‌లో ఒక వ్యక్తి సీజేఐ పేరుతో ఓ పోస్టు పెట్టాడు.
"హలో, నేను భారత ప్రధాన న్యాయమూర్తిని (CJI). నేను అర్జెంట్‌గా కొలీజియం మీటింగ్‌కు వెళ్లాలి. కానీ నేను దిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా? సుప్రీంకోర్టుకు చేరిన వెంటనే డబ్బు తిరిగి పంపిస్తాను" అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ సందేశాన్ని తన ఐప్యాడ్ నుంచి పంపుతున్నట్లు సైబర్ నేరగాడు పేర్కొన్నాడు. ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ఆయన సూచనల మేరకు సుప్రీంకోర్టు అధికారులు దిల్లీ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.