Bhole Baba On Hathras Stampede : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్ తొక్కిసలాటపై ఎట్టకేలకు భోలే బాబా స్పందించారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
'జులై 2 ఘటనతో మేము చాలా వేదనకు గురయ్యాం. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు ఆ భగవంతుడు తగు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని నేను నమ్ముతున్నాను. నాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉండాలని కమిటీ సభ్యులకు సూచించాను' అని భోలే బాబా అన్నారు.
భోలే బాబా ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. అయితే జులై 2న హాథ్రస్‌లో నిర్వహించిన సత్సంగ్‌కు 80వేల మందికి మాత్రమే ఏర్పాట్లు చేయగా, రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. దీనితో తొక్కిసలాడి జరిగి 121 మంది మరణించారు.