ETV Bharat / snippets

UGC NET ప్రశ్నాపత్రం నకిలీ స్క్రీన్‌షాట్‌ సర్క్యులేట్​- పాఠశాల విద్యార్థిపై CBI ఛార్జ్​షీట్​!

CBI On UGC NET paper leak
CBI On UGC NET paper leak (Getty Images, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 11:22 AM IST

CBI On UGC NET paper leak : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. యూజీసీ నెట్ నకిలీ ప్రశ్నపత్రం స్క్రీన్‌ షాట్‌ను టెలిగ్రామ్‌లో సర్క్యులేట్‌ చేసిన విద్యార్థిపై ఛార్జ్​షీట్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అది కూడా ఓ పాఠశాల విద్యార్థి చేసినట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీబీఐ ప్రభుత్వానికి అనధికారికంగా చెప్పిందని, ఆ విద్యార్థిపై ఛార్జ్​షీట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు రావడం వల్ల నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున కుట్ర జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధరణకు వచ్చిన సీబీఐ, చీటింగ్‌ చేసేందుకు జరిగిన ప్రయత్నంగా ఈ ఛార్జ్​షీట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.