ETV Bharat / snippets

రైల్వే ట్రాక్‌పై బాంబ్ బ్లాస్ట్!- ఎవరి పని?

Railway Track Blast
Railway Track Blast (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 5:09 PM IST

Railway Track Blast : ఝార్ఖండ్​లో బొగ్గు రవాణాకు వినియోగించే రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చివేశారు కొందరు దుండగులు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రాక్​కు 15 మీటర్ల దూరంలో పేలుడుకు ఉపయోగించిన వైర్లను గుర్తించారు. ఘటన వెనక క్రిమినల్‌ ముఠాల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

సాహిబ్‌గంజ్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చేసినట్లు బుధవారం పోలీసుల వెల్లడించారు. ఘటనలో 470 సెం.మీల మేర ట్రాక్ ధ్వంసం అయినట్లు తెలిపారు. అది భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో భాగం కాదని చెప్పారు. గోడ్డాలోని లాల్‌మాటియా నుంచి బంగాల్​ ఫరక్కాలోని తమ పవర్ స్టేషన్‌కు బొగ్గును రవాణా చేసేందుకు ప్రమాదానికి గురైన రైల్వే ట్రాక్‌ను వినియోగిస్తున్నట్లు ఎన్టీపీసీ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.