ETV Bharat / snippets

మమతా బెనర్జీపై గవర్నర్ బోస్​ పరువు నష్టం కేసు- అలా అన్నందుకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 7:30 AM IST

West Bengal Governor Vs Mamata
West Bengal Governor Vs Mamata (ANI)

West Bengal Governor Vs Mamata : బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ శుక్రవారం కలకత్తా హైకోర్టులో పరువునష్టం కేసును వేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్‌భవన్‌లో ఇటీవల జరిగిన ఘటనల వల్ల అక్కడికి వెళ్లేందుకు భయపడుతున్నామని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని మమత పేర్కొనడం వల్ల కేసు వేసినట్టు పేర్కొన్నాయి. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆనందబోస్ విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రతినిధులు తప్పుడు, అపవాదులు సృష్టించకూడదన్నారు. సీవీ ఆనందబోస్ వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది మే 2న ఒక మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి ఆరోపించారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆనందబోస్‌కు, మమతా బెనర్జీకి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరిగింది. పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.