ETV Bharat / snippets

బంగ్లాదేశ్ సంక్షోభంపై దిల్లీలో అఖిలపక్ష సమావేశం

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 10:51 AM IST

Updated : Aug 6, 2024, 11:30 AM IST

All party meeting on Bangladesh issue
All party meeting on Bangladesh issue (ANI)

All party meeting on Bangladesh issue : బంగ్లాదేశ్‌ సంక్షోభం పరిణామాలపై కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంటు హాలులో జరిగిన ఈ భేటీలో బంగ్లాదేశ్​లో జరుగుతున్న పరిణామాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ వివరించారు. ఇప్పటివరకు భారత్‌ తీసుకుంటున్న చర్యలు గురించి అఖిలపక్షానికి తెలిపారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. ఈ భేటీకి అధికార పక్షం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌గాంధీ, వేణుగోపాల్‌తోపాటు, ఎస్​పీ, టీఎంసీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశమై, అక్కడ పరిస్థితులను సమీక్షించింది. 1971లో జరిగిన బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

Last Updated : Aug 6, 2024, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.