ETV Bharat / snippets

జ్యుడీషియల్‌ కస్టడీకి కేజ్రీవాల్‌- మళ్లీ తిహాడ్​ జైలుకు దిల్లీ సీఎం

Arvind Kejriwal In cbi judicial custody
Arvind Kejriwal sent to judicial custody (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 7:10 PM IST

Updated : Jun 29, 2024, 8:17 PM IST

Arvind Kejriwal Judicial Custody : మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్​ పార్టీ కన్వీనర్​, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు శనివారం కేజ్రీవాల్​ను జ్యుడిషియల్​ కస్టడీలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. కేజ్రీవాల్‌ విచారణ సమయంలో సరిగా సహకరించలేదని సీబీఐ రిమాండ్‌ దరఖాస్తులో పేర్కొంది. నేరం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాధారాలకు విరుద్ధంగా సమాధానాలు ఇచ్చారని, కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పలేదని వెల్లడించింది. ఇదంతా కేజ్రీవాల్​ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపించింది. మరికొన్ని రోజుల పాటు ఆయనను కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరింది. సీబీఐ అభ్యర్థనను పరిశీలించిన దిల్లీ న్యాయస్థానం, కేజ్రీవాల్‌ను జులై 12 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో మళ్లీ ఆయనను తిహాడ్​ జైలుకు తరలించారు.

Last Updated : Jun 29, 2024, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.