ETV Bharat / snippets

సల్మాన్​ ఖాన్ బెదిరింపుల కేసులో ట్విస్ట్- క్షమించాలంటూ మరో మెసేజ్

Salman Khan Bishnoi Issue
Salman Khan Bishnoi Issue (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : 12 hours ago

Salman Khan Bishnoi Issue : బాలీవుడ్ నటుడు సల్మాన్​ ఖాన్​ను చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్​ పెట్టిన నిందితుడు క్షమాపణులు కోరాడు. బెదిరింపు మెసేజ్​లు పెట్టిన నంబర్​ నుంచే తనను క్షమించాలని కోరుతూ ముంబయి పోలీసులకు వాట్సాప్​లో సందేశం పంపించాడు.

ఇటీవల సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎన్​సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమంలోనే సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్​ 18న లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే సల్మాన్​ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఓ మెసేజ్‌ వచ్చింది. లేదంటే దారుణ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ ఘటనపై ముంబయి వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సోమవారం అదే నంబర్​ నుంచి మరో మెసేజ్​ వచ్చినట్లు ముంబయి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. క్షమించాలని కోరుతూ వాట్సాప్​లో మరో మెసేజ్​ పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.