వైఎస్సార్సీపీ కొత్త పల్లవి - హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి: వైవీ సుబ్బారెడ్డి - విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 11:00 PM IST
YV Subba Reddy Sensational Comments on AP Capital: విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా చేయడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందువల్లనే అవి తీరేవరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్నిఅడుగుతామంటూ వైఎస్సార్సీపీ కొత్త పల్లవి అందుకున్నారు. రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ తర్వాత విశాఖ వచ్చిన వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత కేంద్రంతో చర్చించి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉండేలా కొరుతామని వివరించారు. గత ప్రభుత్వం రాజధాని కట్టలేకపోయిందని విమర్శించారు. అది సాధ్యం కాదు కనకే తాము విశాఖ కార్యనిర్వాహక రాజధాని అంటూ ప్రతిపాదించామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో అంశంపై కసరత్తు చెస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థుల కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని త్వరలోనే మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకు వెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాల్సి ఉందని తెలిపారు.