టీడీపీ కుటుంబంపై వైఎస్సార్సీపీ మూకల దాడి- కర్రలతో వీరంగం - YSRCP Attacked on TDP Cadres - YSRCP ATTACKED ON TDP CADRES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 11:32 AM IST

YSRCP Workers Attacked on TDP Cadres With Sticks : కర్రలతో వైఎస్సార్సీపీ మూకలు దాడికి పాల్పడటంతో పార్వతమ్మకు గాయాలైన ఘటన తనకల్లు మండలంలోని టి.సదుం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు సిద్ధిక్‌ వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరాడు. అనంతరం నియోజకవర్గ బాధ్యుడు మగ్బూల్‌ అహ్మద్‌ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాడు. టీడీపీకి చెందిన యువకుడు మధు వద్ద సిద్ధిక్‌ వాలంటీరుగా చేరుతా అని అన్నాడు. నువ్వు వైఎస్సార్సీపీ అయి ఎలా వాలంటీరుగా తీసుకుంటారని మధు ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఇంటికి వెళ్లిపోయారు. 

అనంతరం సిద్ధిక్‌ కుటుంబ సభ్యులు, బంధువులు మధు ఇంటి వద్దకు వెళ్లారు. మధు, అతని తల్లి పార్వతమ్మ, యువకుడు రమేశ్‌పై కర్రలతో దాడిచేశారు. పార్వతమ్మ కాలికి, చేతికి గాయాలయ్యాయి. టీడీపీ వర్గీయులు గుమికూడటంతో వైఎస్సార్సీపీ వర్గీయులు అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు విషయం తెలిపారు. ఎమ్మెల్యే డీఎస్పీకి ఫోన్‌ చేసి విషయం తెలపగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అనంతరం మంగళవారం రెండు వర్గాల వారిని పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశింశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.