టీడీపీ సానుభూతిపరులపై వైఎస్సార్సీపీ అనుచరుల దాడి - ఇరువర్గాల మధ్య ఘర్షణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 11:42 AM IST
YSRCP Supporters Attacked on TDP Followers In Annamayya District : అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొత్తపల్లిలో గతరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన తెలుగుదేశం సానుభూతిపరులు ఆంజనేయులు దంపతులు ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో సారా తయారీ, విక్రయాలపై ఆంజనేయులు కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారని భావించి వైఎస్సార్సీపీకి (YSRCP) చెందిన శ్రీనివాసులు, వెంకటేశు కుటుంబ సభ్యులు దాడి చేశారని బాధితులు వాపోయారు.
YSRCP Supporters Attacked on TDP Followers : తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) తరలించారు వైద్యులు సూచన మేరకు వారిని కడప రిమ్స్‌కు తరలించారు. ఘర్షణపై వీరబల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వీరబల్లి మండల టీడీపీ (TDP) అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, తెలుగు యువత నాయకుడు నేతి రమేష్ బాబు రెడ్డన్న రామకృష్ణంరాజులు పరామర్శించారు.