వైసీపీను వీడిన మరో ఎమ్మెల్యే - రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక - ycp mla chitti babu joins congress - YCP MLA CHITTI BABU JOINS CONGRESS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 7:38 PM IST

YSRCP MLA Kondeti Chitti Babu Joined Congress: ఎన్నికల ముందు వైఎస్సార్సీపీకి షాక్​లు మీద షాక్​లు తగులుతున్నాయి. ఒక్కొక్కరిగా నేతలు ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. తాజాగా వైసీపీకి (YSRCP) మరో ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చారు. డాక్టర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైసీపీను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు బహిరంగ సభలో షర్మిల పార్టీ కండువా వేసి చిట్టిబాబును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 

ఈ ఎన్నికల్లో పి.గన్నవరం సీటును సింటింగ్‌ ఎమ్మెల్యే అయిన చిట్టిబాబుకు కాకుండా వేణుగోపాల్‌కు వైసీపీ అధిష్ఠానం కేటాయించింది. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న చిట్టిబాబు నేడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడారు. గతంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.