సభ మధ్యలోనే వెళ్లిపోయిన మహిళలు - మాట్లాడకుండానే వెనుదిరిగిన ఎంపీ - MP Vijayasai Reddy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 10:39 PM IST
YSRCP MP Vijayasai Reddy: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చిరాకు వచ్చింది. బహిరంగ సభకు వచ్చిన కొంత మహిళలు మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఎంపీ సభను ఉద్దేశించి ప్రసంగించకుండానే వేదికి దిగి వెళ్లిపోయారు. నగరపాలక సంస్థ పరిధిలోని మహిళలకు ఆసరా పథకం కింద నిధులు విడదలయ్యాయి. వాటిని మహిళలకు పంపిణీ చేసేందుకు నగరపాలక సంస్థ భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సభ కోసం నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 5వేల మందికిపైగా మహిళలను తరలించారు. విజయసాయిరెడ్డి వేదికపైకి వచ్చే సరికి సగం మంది మహిళలు వెళ్లిపోయారు. సభ ప్రారంభించే సమయానికి మరింత మంది వెళ్లిపోవడంతో ఆయనకు చిర్రెత్తింది. ఇక చేసేదేమీ లేక చెక్కులు ఇచ్చి ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రసంగం ఉంటుందని ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది. ఆసరా చెక్కులు ఇవ్వడం వరకే తన పని అన్నట్లుగా ఎంపీ వ్యవహరించారు.