శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం - కానుక సమర్పించిన ఎంపీ వేమిరెడ్డి - Srisailam Temple Swarna Ratham
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 10:47 PM IST
Golden Chariot to Srisailam Temple: శ్రీశైల క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి స్వర్ణ రథాన్ని దాతలు అందించారు. నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతులు ఈ స్వర్ణ రథాన్ని స్వామివారికి అందించారు. దాని విలువ సుమారు 11 కోట్ల రూపాయలు ఉంటుందని వివరించారు. రథం ఎత్తు 23.6 అడుగులు ఉందని, దాని చుట్టూ దేవత మూర్తులను అలంకరించినట్లు తెలిపారు. రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులను కొలువు తీర్చినట్లు వివరించారు.
YSRCP MP Vemireddy Prabhakar Reddy Donates: రథసప్తమిని పురస్కరించుకొని స్వర్ణ రథాన్ని దేవస్థానానికి దాతలు అప్పగించారు. ఈ క్రమంలో దేవస్థానం అర్చకులు రథానికి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైల దేవస్థానం ఈవో పెద్దిరాజు, చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. స్వర్ణ రథాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. శ్రీశైల ప్రధాన పురవీధుల్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని, స్వర్ణ రథ ప్రారంభం అనంతరం ఊరేగించారు. ఈ క్రతువును తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.