పోలీస్ స్టేషన్ ముందు పేర్ని నాని వీరంగం- ఎస్ఐ తో దురుసు ప్రవర్తన - Perni Nani threatening SI - PERNI NANI THREATENING SI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 8:15 PM IST
YSRCP MLA Perni Nani Protest : కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలూకా పోలీసు స్టేషన్ ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిట్టు హంగామా సృష్టించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసు పెట్టడమే కాకుండా కొట్టారంటూ పెద్ద ఎత్తున అనుచరులతో పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ చాణిక్యతో పేర్ని నాని దురుసుగా ప్రవర్తించారు. పేర్ని నాని అనుచరులు స్టేషన్‌లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. స్టేషన్ ముందు పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు బైఠాయించారు.
Perni Nani threatening SI : గత రెండు రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్‌లపై 50వ డివిజన్‌కు చెందిన వైసీపీ సానుభూతిపరులు దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టడంతో పాటు ఎస్ఐ కొట్టారంటూ కొట్టారంటూ పేర్ని నాని హంగామా చేశారు. అనంతరం ఎస్ఐ తప్పు చేశారంటూ నిరసనకు దిగారు.
ఎస్ఐ చాణిక్య తెలుగుదేశం పార్టీ వాళ్లకు కొమ్ము కాస్తున్నాడని పేర్ని నాని ఆరోపించారు. దెబ్బలు తిన్న వాళ్లని విచక్షణారహితంగా కొట్టడం ఎంత వరకు సబబని అంటూ ఊగిపోయారు. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేపడతామని డీఎస్పీ అబ్దుల్ సుభానీ తెలిపారు. విచారణ అనంతరం జిల్లా ఎస్పీకి నివేదిక అందిస్తామని చెప్పారు. ఎస్ఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు.