బూతులతో విరుచుకుపడ్డ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి- బీజేపీ అభ్యర్థిపై వ్యక్తిగత దూషణలు - Ketireddy Controversial Comments - KETIREDDY CONTROVERSIAL COMMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 5:42 PM IST
YSRCP MLA Candidate Ketireddy Controversial Comments: ధర్మవరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై బూతుల దండకం చదివారు. బీజేపీ అభ్యర్థి సత్య కుమార్‌పై తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. దిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్ తనపై పోటీకి దిగారని, సత్యకుమార్ బీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని కేతిరెడ్డి అన్నారు. సత్యకుమార్ యాదవ్ కులానికి చెందిన వాడిగా నిరూపించుకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.
"దిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్ నాపై పోటీకి దిగారు. సత్యకుమార్ బీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. సత్యకుమార్ యాదవ్ కులానికి చెందిన వాడని నిరూపణ చేసుకుంటే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా." - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే