తమ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు- గవర్నర్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు - YSRCP leaders met Governor
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 9:13 PM IST
YSRCP leaders met Governor: ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత ఏపీలో తమ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని వీటిని నివారించాలని వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కోరారు. టీడీపీ-జనసేన శ్రేణులు వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లపై దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ కు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి,ఎంపీలు గురుమూర్తి, తనూజ, ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, మత్స్యలింగం, విశ్వేశ్వర రాజ్ తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దాడులను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీహార్ సంస్కృతికి టీడీపీ నేతలు బీజం నాటుతున్నారని, టీడీపీ వారు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని చెప్పామన్నారు. దాడులకు సంబంధించి ఆధారాలన్నింటినీ గవర్నర్ కు ఇచ్చామని, డీజీపీని పిలిపించి విచారణ జరిపిస్తామని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని తెలిపారు.