పుంగనూరులో టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్ - వైఎస్సార్సీపీ శ్రేణుల బెదిరింపులు - 14 Polling Agents kidnap Chittoor - 14 POLLING AGENTS KIDNAP CHITTOOR
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 10:47 AM IST
YSRCP Leaders kidnapped 14 Polling Agents in Chittoor District : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏడుగురు ఏజెంట్లను వైఎస్సార్సీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఏజెంట్లు బూరుగుమంద పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా కిడ్నాప్ చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు తమను కిడ్నాప్ చేసి బెదిరించారని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే మరో వైపు వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. టీడీపీ పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చెస్తూ, పోలింగ్ కేంద్రాల్లో ఇష్టారీతిన దాడులు జరుపుతూ ఎన్నికలకు విఘాతం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల దుశ్చర్యలకు అడ్డుకట్ట పడటం లేదని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసేవరకు ఇంకెన్ని అరాచకాలకు పాల్పడతారోనని ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడి, చంపుతామని బెదిరించారని బాధితులు పేర్కొన్నారు.