బాపట్ల జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు - ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు - అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 1:35 PM IST
YSRCP Leaders Illegal Sand Mining in Bapatla District: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని తీర ప్రాంతంలోని అసైన్డ్ పట్టా భూముల్లో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) ఆదేశాలను తుంగలో తొక్కి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. 50 నుంచి 60 అడుగుల లోతున త్రవ్వకాలు చేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని గ్రామస్థులు తెలిపారు.
Farmers Protest on Illegal Sand Mining: అక్రమ ఇసుక తవ్వకాలతో ఏడాదికి మూడు పంటలు పండే భూముల్లో భూగర్భ జలాలు అడుగంటి ఉప్పుగా మారాయన్నారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ తవ్వకాల (Illegal Sand Mining)పై రైతులు ఆందోళన (Farmers Protest) చేపట్టి, ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన బడా నేతలు ఉండటంతో అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.