ఎన్నికల కమిషన్ హెచ్చరికలు భేఖాతరు- విచ్చలవిడిగా వైఎస్సార్సీపీ ప్రచారాలు - YCP Leaders ElectionCode Voilation - YCP LEADERS ELECTIONCODE VOILATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 26, 2024, 6:59 PM IST
YSRCP Leaders Election Code Voilation in Anakapally district : ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రాష్ట్రంలో వాలంటీర్లు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేశ్ ప్రచారంలో భాగంగా వాలంటీర్లు (volunteers ) ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థికి జై అంటూ నినాదాలు చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లఘించిన వాలంటీర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
వాలంటీర్లకు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటిని భేఖాతరు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికారుల బాటలోనే కార్యకర్తలు నడుస్తున్నారు, ఓ వైపు ఎన్నికల కోడ్ (Election code) అమలులో ఉన్నప్పటికీ సమావేశాలు, ప్రచారాలతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ప్రచారాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రతిపక్ష నేతలు కోరారు.