అరకొర వేతనాలతో ఎలా బ్రతికేది- నిలదీసిన వందలాది వాలెంటీర్లు! భారీగా తాయిలాలు ఇచ్చి బుజ్జగించిన ఎమ్మెల్యే - వాలంటీర్లకు గృహోపకరణాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 1:31 PM IST

YSRCP Leaders Distributing Gifts To Volunteers in Nellore District : వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం పెంచలేదన్న అసంతృప్తిగా ఉన్న వారికి వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించే చర్యలు చేపడుతున్నారు. అందరినీ ఒక చోటకు చేర్చి తాయిలాలను అందిస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు సతీమణి వసంతకుమారి వాలంటీర్లతో (Volunteers) సమావేశం నిర్వహించారు. మరోసారి జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే వాలంటీర్ల గౌరవ వేతనం 10 వేల రూపాయలకు పెంచుతారని తెలిపారు. సమావేశానికి వచ్చిన 260 మంది వాలంటీర్లకు గృహోపకరణాలను (Household appliances) అందించి సంతృప్తి పరుస్తున్నారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ అధికార పార్టీ తాయిలాల తంతు వేగం పుంజుకుంటుందనేే చెప్పాలి. కానీ అది ప్రత్యక్షంగా ప్రజలకు కాదు వాలెంటీర్లకు మద్ధతు కూడగట్టమని బహుమతులతో బుట్టలో వేసుకుంటున్నారని ప్రజలే గుసగుసలాడుకుంటున్నారు. అధికార పార్టీకి ఓటమి భయంతోనే ఇలాంటి పనులు చేస్తుందని పలువురు ఆగ్రహం (Anger)  వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.