అన్నమయ్యలో వైఎస్సార్సీపీ బరితెగింపు - టీడీపీ ఏజెంట్లపై దాడి, కిడ్నాప్ - YSRCP Leaders Attack - YSRCP LEADERS ATTACK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 11:49 AM IST
YSRCP Leaders Attack TDP Leaders in Annamaya District : ఏపీలో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నేతలపై దాడులకు దిగారు. 201 పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లను బయటకు లాగేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. అంతే కాకుండా వారి ఫారాలు లాక్కెళ్లారు. అనంతరం టీడీపీ ఏజెంట్ సుభాష్ అనే వ్యక్తిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన నెలకొంది.
పుల్లంపేట మండలం మల్లెవారిపల్లిలో అధికార నేతలు దౌర్జన్యం చేశారు. టీడీపీ కార్యకర్త జడ రాంప్రసాద్ అనే వ్యక్తిపై వైఎస్సార్సీపీ నేతలు చితకబాదినారు. ఈ సంఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందరని టీడీపీ నేత పుట్టా సుధాకర్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు సిబ్బంది తక్కువగా ఉన్నారని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ ఏజెంట్లపై దాడి చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు