రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులు - కారులో టీడీపీ కండువా పెట్టుకున్నాడని దాడి - YSRCP Leaders Attack on TDP Workers - YSRCP LEADERS ATTACK ON TDP WORKERS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-05-2024/640-480-21374390-thumbnail-16x9-ysrcp-leaders-attack-on-tdp-workers.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 10:14 AM IST
YSRCP Leaders Attack on TDP Workers : రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్నా వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఎన్నికల వేళ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యకాండ పతాక స్థాయికి చేరింది. ఐదు సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడ్డ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అరాచకాలను కొనసాగిస్తున్నారు. శనివారం రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఏకంగా అర్ధరాత్రి తోపుదుర్తిలో తన అనుచరులతో ప్రజలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కారులో ఆ పార్టీ కండువా ఉందని అధికార పార్టీ నేతల అనుచరులు దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. కారులో తెలుగుదేశం పార్టీ కండువా పెట్టుకుని వెళ్తున్నాడనే కక్షతో సికేపల్లి మండలం గువ్వలకుందంపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేణుగోపాల్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. న్యామద్దల క్రాస్ సమీపంలో కారును ఆపి వేణుగోపాల్‌పై దాడి చేశారు. కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. దాడి ఘటనపై బాధితుడు వేణుగోపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.