వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల పర్ఫామెన్స్ అదుర్స్​ - స్వయంగా గాయపర్చుకుని ఆస్పత్రిలో చేరిక - YSRCP Leaders Attack TDP Followers - YSRCP LEADERS ATTACK TDP FOLLOWERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 10:24 AM IST

YSRCP Leaders Attack on TDP Followers in Annamayya District : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం బోయినపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నాయకులు దాష్టీకానికి పాల్పడ్డారు. టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద వైఎస్సార్సీపీ నాయకుల బైక్‌ను అడ్డుపెట్టి ఇబ్బందులు కలిగిస్తుండటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రణాళిక ప్రకారం ముందుగా సిద్ధం చేసుకున్న కర్రలు, పైపులతో తెలుగుదేశం నాయకులపై వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశాయి. ఇంట్లోని సామాన్లు పగలకొట్టి చెల్లాచెదురుగా పడేశారు. తర్వాత తమకు తాము గాయపరుచుకుని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రిలో చేరారు. 

మరోవైపు తీవ్రంగా గాయపడిని తెలుగుదేశం నాయకులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరగింది. వైఎస్సార్సీపీ నాయకుల హంగామా చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కావాలని తగాదాలు పెట్టుకొని విధ్వంసం సృష్టించడాన్ని పలువురు తప్పుబట్టారు. మరోసారి ఇటువంటి దాష్టీక చర్యలు జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. మా ఇళ్ల మీద ఇలా దాడికి దిగితే ఎలా అని తెలుగుదేశం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.