ఆగని వైఎస్సార్సీపీ ఆగడాలు- ఇసుక కొనలేదని కుటుంబంపై దాడి - YSRCP Leaders Attack On Family - YSRCP LEADERS ATTACK ON FAMILY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 1:40 PM IST

YSRCP Leaders Attack On Family : ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ నేతలు చెరువుల్లో, నదుల్లో, కాలువల్లో ఉన్న ఇసుకను ఇష్టానుసారంగా అక్రమంగా తవ్వేశారు. అడ్డుపడిన ప్రజలపై దారుణంగా దాడులు చేశారు. అలా ఇసుక కాస్త బంగారం అయ్యిపోవడంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ అరాచకాలతో విసిగిపోయన ఓటర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పరిమితం చేశారు. కానీ ప్రభుత్వం మారినా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తిరుపతి జిల్లాలో తమ వద్ద ఇసుక కొనుగోలు చేయలేదనే కారణంతో ఆ పార్టీ నాయకులు ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే,

జిల్లాలోని ఇనగలూరులో వరలక్ష్మి కుటుంబ సభ్యులు మట్టి కుండలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తుల నుంచి ఇసుకను కొనుగోలు చేయలేదు. అంతే ఆక్రోశంతో ఊగిపోయిన ఆ పార్టీ నేతలు వరలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులుపై దాడికి దిగారు. ఈ ఘటనలో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాళహస్తి ప్రభుత్వాసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.