కూటమి పార్టీల ఫ్లెక్సీల చించివేత - గ్రామంలో పికెట్‌ ఏర్పాటు - YSRCP Leader Tore nda Flexes - YSRCP LEADER TORE NDA FLEXES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 2:56 PM IST

YSRCP Leader Tore The Flexes of NDA Alliance Parties : బాపట్ల మండలంలోని పాండురంగాపురంలో వైఎస్సార్సీపీ నేత నక్క వీరారెడ్డి మద్యం తాగి వీరంగం సృష్టించాడు. గ్రామంలో కూటమి నేతలు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే వేగ్నేసిన నరేంద్ర వర్మ ఫ్లెక్సీని తన అనుచరులతో కలిసి పీకేశాడు. ఫ్లెక్సీని కింద పడేసి తొక్కాడు. గ్రామంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. 

ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నరేంద్ర వర్మ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తన అనుచరులతో వీరారెడ్డి ధ్వంసం చేయించాడు. వీరారెడ్డి టీడీపీ ఫ్లెక్సీని తొలగించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో ఉంచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీస్ స్టేషన్​కు పిలిపించి డీఎస్సీ మురళి కృష్ణ సీఐ శ్రీహరి కౌన్సిలింగ్ చేశారు. వీరారెడ్డి మాత్రం అందుబాటులో లేడని విజయవాడలో ఉన్న అతడినే పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని సీఐ తెలిపారు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఫ్లెక్సీ తొలగింపు విషయాన్ని టీడీపీ నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వైఎస్సార్సీపీ నేత వీరారెడ్డి తీరును ఆయన ఖండించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.