thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 8:41 PM IST

ETV Bharat / Videos

పోలీసుల అదుపులోకి వైఎస్‌ఆర్‌సీపీ నేత కొల్లం గంగిరెడ్డి - Kollam Gangireddy in Police Custody

YSRCP Leader Kollam Gangireddy Detained by Railway Kodur Police : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, వైఎస్సార్సీపీ నేత కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే కోడూరులోని లక్ష్మీ థియేటర్​కు సంబంధించిన స్థల వివాదంలో గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం థియేటర్ వద్ద వివాదం జరిగింది. దీంతో థియేటర్ యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కొల్లం గంగిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లం గంగిరెడ్డి అనుచరులే థియేటర్ వద్ద గొడవ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై సుమారు గంటపాటు గంగిరెడ్డిని విచారించిన పోలీసులు తర్వాత వదిలేశారు. ఈ వివాదం స్థలానికి సంబంధించిందనే అనుమానంతో విచారణ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పుల్లంపేట మండలానికి చెందిన కొల్లం గంగిరెడ్డి గతంలో భారీగా ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించినట్లు కేసులు ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో అనేక సెటిల్ మెంట్లు, భూదందాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా స్థల వివాదంలో గంగిరెడ్డిని విచారించి పంపించడంపై పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.