అధికార ఎమ్మెల్యేపై విమర్శ - విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు - YSR Leader Father Statue Removed
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 2:04 PM IST
|Updated : Feb 9, 2024, 3:22 PM IST
YSRCP Leader Father Statue was Removed by Unidentified People in Satya Sai District : సత్యసాయి జిల్లా వైసీపీ నేత తండ్రి పెద్దారెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పుట్టపర్తిలోని కామ్రేడ్ లోచర్ల పెద్దారెడ్డి కాలనీలో మాజీ నక్సలైట్లు పెద్దారెడ్డిపై అభిమానంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం (ఫిబ్రవరి 8న) నల్లమాడ వైసీపీ అసమ్మతి నేతల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై పెద్దారెడ్డి కుమారుడు విజయభాస్కర్‌రెడ్డి విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేసినందుకే తన తండ్రి విగ్రహాన్ని చోరీ చేయించారని విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనని ఎదుర్కోలేక ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. విమర్శలు చేశాననే ఉద్దేశంతో రాత్రికి రాత్రే తన తండ్రి విగ్రహాన్ని ఎత్తుకెళ్లడం సమంజసం కాదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీధర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ వైసీపీ అసమ్మతి నేతలు అభిప్రాయం తెలిపారని పేర్కొన్నారు.