ఇంకా స్వామిభక్తేనా? ఇకనైనా వైఎస్సార్సీపీ రంగులు, జగన్​ చిత్రాలు తొలగించరా? - Jagan Photo on RBk Prakasam - JAGAN PHOTO ON RBK PRAKASAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 4:19 PM IST

YSRCP Colours And Jagan Photo on Rythu Bharosa kendram in Prakasam District : ప్రభుత్వం మారింది కానీ అధికారుల తీరు మారడం లేదు. గత అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి భజనలో భాగంగా వైఎస్సార్సీపీ రంగులకు ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారినా కొందరు అధికారుల తీరు అలాగే ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్సీపీ పార్టీ రంగులు, మాజీ మంత్రి చిత్రాలను మార్చే ప్రయత్నమే చెయ్యడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోని రైతు భరోసా కేంద్రం భవనానికి ఇప్పటికీ వైఎస్సార్సీపీ రంగులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాలు దర్శనమిస్తున్నాయి.

నేటికి కార్యాలయాలపై పార్టీ రంగులు చిత్రాలు దర్శనం ఇవ్వడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పాలన కంటే రంగుల పైనే ద్యాస పెట్టారంటూ ధ్వజమెత్తారు. ఈ రైతు భరోసా కేంద్రం ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఉన్నా అధికారులు రోజూ చూస్తూ తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.