జగన్ బస్సు యాత్రకు జనం కరవు - ప్రారంభం రోజే అట్టర్‌ప్లాప్ - CM Jagan Bus Tour Fail
🎬 Watch Now: Feature Video
YSR Chief, CM Jagan Bus Tour Fail : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అట్టహాసంగా ప్రారంభించిన ఎన్నికల ప్రచారం తుస్సుమంది. ఆరంభ యాత్రే అట్టర్‌ప్లాప్ అయ్యింది. ఆయన సొంత జిల్లా, నియోజకవర్గంలోనే జనం జగన్‌కు షాకిచ్చారు. ఆరంభ కార్యక్రమానికి పెద్దగా జనం హాజరు కాలేదు. ఇడుపులపాయ నుంచి జనం పెద్దగా లేకుండానే ప్రొద్దుటూరు వరకు సీఎం బస్సు యాత్ర సాగింది. వేంపల్లె, యర్రగుంట్ల కూడళ్లలో మాత్రం కాస్త జనాలను పోగేశారు.
ప్రజలు ఉన్నచోట బస్సుపైకి ఎక్కి అభివాదం చేసుకుంటూ పోయిన జగన్ పెద్దగా జనం లేనిచోట లోపల నుంచే నమస్కారం పెడుతూ ముందుకు సాగారు. ప్రొద్దుటూరు సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి జనాన్ని బస్సులు పెట్టి మరీ తరలించినా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వచ్చిన వారు మధ్యలోనే తిరిగి వెళ్లిపోయారు. ఇన్నాళ్లంటే అధికారం ఉంది కాబట్టి బెదిరించి, భయపెట్టి డ్వాక్రా మహిళలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజనం పథకం కార్యకర్తలను తరలించేవారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే సరికి జగన్ అసలు రంగు బయటపడింది. అధికారం లేకపోతే జగన్ పరిస్థితి ఏంటో తొలి సభకే తెలిసొచ్చింది.