తులసిరెడ్డితో సునీత దంపతుల భేటీ - కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ! - YS Sharmila to Contest as Kadapa MP - YS SHARMILA TO CONTEST AS KADAPA MP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 3:30 PM IST

YS Sunitha Met Congress Leader Thulasi Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత నర్రెడ్డి తులసిరెడ్డితో భేటీ అయ్యారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి నివాసానికి వచ్చిన సునీత దంపతులు ఆయనతో అరగంట పైగానే సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సునీత దంపతులు తులసిరెడ్డిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

YS Sharmila to Contest as MP From Kadapa? : వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఏ విధంగా ప్రణాళిక రచించుకోవాలనే దానిపైనే ముగ్గురి మధ్య చర్చలు నడిచినట్లు సమాచారం. పులివెందులలో తాజా రాజకీయాలపైన కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 28న షర్మిల ఇడుపులపాయకు వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొంటారని తులసిరెడ్డి తెలిపారు. ఆరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.