ఇంకా ఉచిత బస్సు పథకం ఎందుకు అమలు చేయలేదు: షర్మిల - YS Sharmila Question to Govt - YS SHARMILA QUESTION TO GOVT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 10:50 PM IST
YS Sharmila Question to Govt on Free Bus Scheme for Women: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజే అమలు చేశారని కర్ణాటకలో మూడు వారాల్లో పథకం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. బస్సులో ప్రయాణం అంటే మహిళలకు రక్షణగా ఉంటుందన్నారు. సూపర్ 6లో అన్ని పథకాలు అమలు చేయాలని కోరారు. అమ్మకు వందనం ప్రతి బిడ్డకు ఇస్తామన్నారు. వైజాగ్ స్టీల్‌పై టీడీపీ ప్రజా ప్రతినిధులు రకరకాలుగా మాట్లాడుతున్నారు వైజాగ్ స్టీల్‌కు కాప్టివ్ మైన్ ఉండాలని కోరారు. స్టీల్ ఫ్యాక్టరీపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వైసీపీలో లేరు కాబట్టి గొయ్యి తీసి పార్టీని పాతిపెట్టారన్నారు. వైసీపీ పార్టీ బిజెపి అనుకూల పార్టీయేనని ఇప్పుడు కూడా స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.