LIVE: విశాఖపట్నంలో వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ - ప్రత్యక్ష ప్రసారం - ys sharmila press meet - YS SHARMILA PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 9:59 AM IST
|Updated : Apr 28, 2024, 10:22 AM IST
YS Sharmila Press Meet in Visakhapatnam: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలో వైఎస్ షర్మిల రెండో రోజు ప్రచారం చేపట్టారు. నేడు విశాఖ నార్త్, టెక్కలి, పలాసలో షర్మిల బహిరంగ సభలలో పాల్గొంటారు. షర్మిల ప్రచార జోరును పెంచారు. సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి ఇప్పుడు దగా డీఎస్సీ ఇచ్చారని పలు బహిరంగ సభల్లో షర్మిల విమర్శిస్తున్నారు. ఎన్నికలు 2 నెలలు ఉందనగా ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడు ఆరు నెలలు మాత్రమే నిద్రపోతాడు, సీఎం జగన్ మాత్రం అయిదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు సిద్దమంటూ నిద్రలేచారని వివిధ సభలలో ఎద్దేవా చేశారు. గతంలో పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగాను అని చెప్పి ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోందని మండిపడ్డారు. నాసిరకం మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారని ఆరోపించారు. ఆ మద్యం తాగి ప్రజలు చనిపోతున్న పట్టించుకోలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న షర్మిల, విశాఖలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Apr 28, 2024, 10:22 AM IST