ETV Bharat / offbeat

పావ్ భాజీ మసాలా ఇలా రెడీ చేసుకోండి - ఎప్పుడంటే అప్పుడు వేడి వేడిగా తినేయొచ్చు - PAV BHAJI MASALA RECIPE

స్ట్రీట్​ ఫుడ్​లో పావ్​ భాజీకి ఆదరణ - ఇలా మసాలా రెడీ చేసుకుంటే ఎంతో ఈజీ!

Home Made Pav Bhaji Masala
Home Made Pav Bhaji Masala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2025, 11:40 AM IST

Home Made Pav Bhaji Masala : మనలో చాలా మందికి పావ్ ​భాజీ అంటే ఎంతో ఇష్టం. స్పైసీ స్ట్రీట్​ ఫుడ్​ ఐటమ్స్​లో ఇది కూడా ఒకటి. ముంబయిలో ఏ వీధిలో చూసినా పావ్​ భాజీ అమ్మే బండి కనిపిస్తుంటుంది. మన దగ్గర కూడా చాలా చోట్ల అమ్ముతుంటారు. ఈవెనింగ్​ టైమ్​లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి పావ్​ భాజీ తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. అయితే, పావ్​ భాజీ తయారు చేసుకోవడానికి అన్నింటికంటే ముఖ్యంగా మసాలా పొడి చాలా అవసరం. అది ఉంటే ఎప్పుడంటే అప్పుడు సింపుల్​గా పావ్ ​భాజీని రెడీ చేసుకొని వేడివేడిగా తిని ఆనందించవచ్చు. మార్కెట్లో చాలా రకాల పావ్​ భాజీ మసాలా పొడులు ఉంటాయి. అయితే, మీరు కూడా ఇంట్లో ఈ మసాలా పౌడర్​ని సిద్ధం చేసుకోవచ్చు. మరి అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ధనియాలు - 3 టేబుల్‌స్పూన్లు
  • జీలకర్ర - రెండున్నర టేబుల్‌స్పూన్లు
  • మిరియాలు - 2 చెంచాలు
  • సోంపు - టేబుల్‌స్పూన్‌
  • ఆమ్‌చూర్‌ పౌడర్‌ టేబుల్‌స్పూన్‌
  • ఎండుమిర్చి - 12
  • దాల్చినచెక్క మూడంగుళాల ముక్క
  • లవంగాలు - 10
  • యాలకులు - 4
  • నల్ల యాలకులు - 2
  • బిర్యానీ ఆకులు - 2
  • స్టార్‌ మొగ్గ (అనాస పువ్వు) - 1
  • డ్రై జింజర్‌ పౌడర్‌ - అర చెంచా

మసాలా పౌడర్ తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​పై కడాయి పెట్టి వేడి చేయండి. ఆపై ఇందులో స్టార్‌ మొగ్గ, దాల్చినచెక్క, నల్ల యాలకులు, బిర్యానీ ఆకులు, ధనియాలు, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేయించాలి.
  • మసాలా దినుసులను వేయించుకున్న తర్వాత పళ్లెంలోకి తీసుకోవాలి.
  • ఆపై అదే కడాయిలో మిరియాలు, లవంగాలు, జీలకర్ర, సోంపు, ఆకుపచ్చ యాలకులను మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి. వీటిని కూడా మసాలా దినుసులు వేపిన ప్లేట్లోకి తీసుకోండి.
  • అనంతరం కడాయిలోకి ఆమ్‌చూర్‌ పౌడర్, డ్రై జింజర్‌ పౌడర్‌లను వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.
  • (మసాలా దినుసులన్నింటినీ కడాయి వేడెక్కిన తర్వాత లోఫ్లేమ్​లో వేయించుకోవాలి. లేకపోతే మసాలాలు మాడిపోయే అవకాశం ఉంటుంది.)
  • ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే హోమ్​మేడ్​ పావ్‌భాజీ మసాలా రెడీ!
  • ఈ పౌడర్​ని తడి లేని, గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు పావ్‌భాజీ చేసుకోవచ్చు.
  • ఈ పౌడర్​ తయారీ నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి.

బ్యాచిలర్స్​ కూడా ఈజీగా చేసే "ఎగ్​ వెజ్​ బిర్యానీ" - ఒక్కసారి తింటే వదలిపెట్టరు!

"రాయలసీమ స్టైల్​ నాటుకోడి వేపుడు" - సంక్రాంతికి ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్​ లెవల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.