LIVE పలమనేరులో వైఎస్ షర్మిలా ఎన్నికల ప్రచారం - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Election Campaign - YS SHARMILA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 4:37 PM IST
|Updated : Apr 15, 2024, 6:33 PM IST
YS Sharmila Election Campaign in Chittor Live : ఏపీ న్యాయ యాత్ర పేరుతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా చిత్తూరు జిల్లాలో రెండో రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇవాళ జీడీనెల్లూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటన ముగిసిన అనంతరం పలమనేరులో పర్యటిస్తున్నట్లు పార్టీ వర్గాల వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఎప్పుడైనా నియోజక వర్గానికి వచ్చారా? అంటూ ప్రజలను ప్రశ్నించింది. మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వం అమ్మడమా అంటూ అధికార పార్టీపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో 7 సార్లు విద్యుత్, 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు వైఎస్ షర్మిల గుర్తు చేశారు. సీఎం జగన్ తన అయిదేళ్లు పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించింది.
Last Updated : Apr 15, 2024, 6:33 PM IST