ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి : షర్మిల - sharmila comments on Jagan - SHARMILA COMMENTS ON JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 9:40 PM IST
YS Sharmila Election Campaign in Bapatla District: ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క క్యాలెండర్‌ను కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను జగన్ వంచించారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. మెగా డీఎస్సీ ఇస్తానంటూ మభ్యపెట్టి తీరా ఎన్నికలకు ముందు దగా డీఎస్సీ ఇచ్చారని బాపట్ల నియోజకవర్గం కర్లపాలెంలో నిర్వహించిన ఎన్నికలో ప్రచారంలో దుయ్యబట్టారు. ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీకి ఎందుకు ఓటేయ్యాలని షర్మిల ప్రశ్నించారు.
బాపట్ల ఎమ్మెల్యే ఇసుక, ఖాళీ స్థలాలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాల పేరుతో దోచుకున్న వ్యక్తికే మళ్లీ వైసీపీ సీటు ఇచ్చిందని లేవనెత్తారు. పది సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేదని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవని విచిత్ర పేర్లతో నాసిరకం మద్యం అమ్మి ప్రజల్ని చంపేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మన రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తున్నారని షర్మిల దుయ్యబట్టారు.