మంత్రి లోకేశ్ పర్యటనలో అనుమానస్పదంగా డ్రోన్ - ఉలిక్కిపడ్డ పోలీసులు - Drone issue in independence day - DRONE ISSUE IN INDEPENDENCE DAY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-08-2024/640-480-22212993-thumbnail-16x9-you-tuber-flew-drone-without-permission.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 3:53 PM IST
YouTuber Flew Drone Without Permission in Independence Day Celebrations at Guntur Police Parade Ground : గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకల్లో డ్రోన్ తిరగడం అధికారులు, పోలీసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. నగరానికి చెందిన ఓ యూట్యూబర్ అనుమతి లేకుండా డ్రోన్‌తో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను చిత్రీకరించేందు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యూట్యూబర్(యువతి)ను అదుపులోకి తీసుకుని, డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తన పేరు నందినిగా పేర్కొంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఏఎస్సై శ్రీనివాసరావు కుమార్తె అని పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఆ యూట్యూబర్ తాను గతంలో కూడా అనేక కార్యక్రమాలను ఇలాగే చిత్రీకరించానని, ఇప్పుడు అనుమతి కావాలని కొత్తగా అడుగుతున్నారేంటని పోలీసులను ప్రశ్నించడంతో అధికారులంతా అవాక్కయ్యారు. డ్రోన్‌ను పోలీసు అధికారులు సీజ్ చేశారు.