thumbnail

దసరా ఉత్సవాల్లో అబ్బురపరిచిన విన్యాసాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Youth Stunts in Dasara Celebrations: దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పండగ సమయాన్ని చిన్నా పెద్దా అంతా కలిసి సరదాగా గడుపుతున్నారు. కర్నూలు జిల్లాలో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడెకల్‌ గ్రామీణ యువకులు అబ్బురపరిచే విన్యాసాలు చేశారు. వీపునకు ఇనుప కొక్కేలు తగిలించుకుని గాలిలో వేలాడటం, బండి చక్రం లాగడం, కర్రసాము పల్టీలు వంటి విన్యాసాలతో ఆకట్టుకున్నారు. పొలం పనులకు వెళ్లే యువకులు ఖాళీ సమయాల్లో సాధన చేసి దసరా ఉత్సవాల్లో వాటిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు.

ఊరేగింపులో అపశ్రుతి: మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో చెన్నకేశవ స్వామి ప్రభ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగిస్తుండగా ప్రభ ఒరిగి భక్తులపై పడింది. ప్రమాదంలో ఐదుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒరిగిన ప్రభ విద్యుత్‌ తీగలపై పడింది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.